విభజన చట్టం లో చెప్పిన విధంగా కడప జిల్లా కు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చెయ్యాలని ప్రొద్దుటూరు స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ తో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశారని ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారని ఇప్పుడు వారు అధికారం లో ఉన్నారని చిత్త శుద్దితో ప్రయత్నం చేసి తప్పకుండా కడప జిల్లా కు ఉక్కు ఫ్యాక్టరీ తేవాలని వారు డిమాండ్ చేశారు. అందరితో కలిసి అందర్నీ కలుపుకొని స్టీల్ ప్లాంట్ ని సాధించుకునే దిశలో భాగంగా…. విభజన బిల్లులో పేర్కొన్న ప్రధానమైన అంశాలలో మనకు అత్యంత ప్రధానమైనది స్టీల్ ప్లాంట్. అలాగే మరో ప్రధానమైన అంశం స్పెషల్ స్టేటస్, ఈ రెండు అంశాలను టిడిపి మేనిఫెస్టోలో చేర్చలేదు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన సందర్భంలోనూ ప్రధాన డిమాండ్లుగా ఈ రెండు అంశాలను వారి ఎదుట పెట్టలేదు. మొదటినుంచి ఆయన రాజధాని అమరావతి పోలవరం అనే మంత్రాలనే జపిస్తూ వస్తున్నాడు, వీటివల్ల రాయలసీమ ప్రాంతానికి కడప జిల్లాకు ఒరిగిందేమీ లేదు కడప ఉక్కు హక్కు విషయమై గతంలో అన్ని విపక్షాలతో పాటు టిడిపి కూడా గెలిమెత్తింది అన్ని విభక్షాలతో పాటు టిడిపి కూడా గల వ్యక్తింది. ఏకంగా కడపలో నిరాహార దీక్షలు కూడా చేయించింది సీఎం రమేష్ బీటెక్ రవి చురుగ్గా ఆమన నిరాహార దీక్షలో పాల్గొన్నారు టిడిపిలో చేరారు అలాగే కూటమిలో భాగస్వామ్యమైన బిజెపి ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు గతంలో స్టీల్ ప్లాంట్ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ రావాలనే కోరుకుంటున్నారు అయితే మనం కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ ని సాధించుకోకపోతే ఇక స్టీల్ ప్లాంట్ రాదు సీమ బిడ్డల ఆకాంక్షలతో ఒక్కటైనా స్టీల్ ప్లాంట్ అడుగులు వేయాల్సి ఉంది .ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అందుకే సింగల్ ఎజెండా డిమాండ్తో స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం సీరియస్ గా పనిచేసేందుకై ఉద్యమిస్తోంది. ఎందుకై ప్రజల మద్దతును కోరుకుంటో0ది. ఈ స్టీల్ ప్లాంట్ పాత్రికేయ సమావేశంలో కన్వీనర్ ఖలందర్, ఓ కన్వీనర్ సలీం,, కోకన్వీనర్ కులాయప్ప, కార్యవర్గ సభ్యులు చంద్ర, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ కావాలి! స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం | Kadapa steel factory wanted | Smd Voice
22 Views