22 Views
3 రోజుల్లో GO చూపియండి, లేదంటే చెట్టు క్రింద నుంచి ఐనా మా అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని పరిపాలన చేస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ బీమునిపల్లె లక్ష్మిదేవి అన్నారు. ఇటివల తెలుగుదేశం పార్టీ కి చెందినా కొంత మంది కార్యకర్తలు దౌర్జన్యంగా తమ ఛాంబర్ కు వచ్చి తన అభిమాన నాయకుల ఫోటోలు తీసి వేయటం పై ప్రొద్దుటూరు రాజకీయం ఒక్క సారి గా హీట్ ఎక్కింది. ఈ సమస్య కు పరిష్కారం కోసం ఈ రోజు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ను కల్సి ఒక వినతి పత్రం ఇచ్చి మాకు 3 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్యులను చూపియలని లేకుంటే తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొనే అవకాశమన్న ఇవ్వాలని, లేనిచో తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టుకొని చెట్టు క్రింద నుంచి ఐనా పరిపాలన కొనసాగింస్తామని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మెన్ భీముని పల్లె లక్ష్మి దేవి ప్రెస్ తో అన్నారు.