ఇటీవల కాలం లో రోడ్డులు వేయలేదని టిడిపి నాయకులు ఊరి బయటికీ వెళ్ళి ప్రోగ్రాం చేయడం పై ఎమ్మెల్యే ప్రస్తావించారు, గతం లో 25 సం. వరద రాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గా ఉండి కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి చేయలేక పోయారని దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హాయం లో జిల్లా అంతా అభివృద్ధి చెందితే ప్రొద్దుటూరు లో మాత్రం సుమారు 500 కోట్లు రూ. నిదులు వెన్నక్కి పంపిన చేతకానీ వ్యక్తి గా మిగిలిపోయారని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు .
ప్రొద్దుటూరు నియోజక వర్గం లో సోమాపురం అనే గ్రామం లో ఎప్పటి నుంచో తీరని సమస్య వంక పై కాజ్ వే నిర్మాణం , మా దృష్టి కి మేము ప్రతి పక్షం లో ఉన్నపుడే వచ్చింది అప్పుడే వెంటనే స్పందించి ఎంపి అవినాష్ రెడ్డి దృష్టి కి తీసుకొని పోయు సుమారు 30 లక్షల రూ డబ్బులు ఎంపి ఫండ్ తెప్పించి సమస్య పరిస్కారం చేయడానికీ ప్రయత్నం చేశాము.
నెల రోజుల క్రితం సోమాపురం గ్రామ ప్రజలు అంతా ఎమ్మెల్యే రాచమల్లు దృష్టి కి మరొక సారి తెచ్చారు, ముఖ్యంగా గ్రామానికి చెందిన మహిళలు వర్షం వచ్చినప్పుడు చీరలు పైకి ఎత్తుకొని నీళ్ళ ల్లో పోయే అవస్తాల గురించి మహిళలు చెప్పడం తో వెంటనే ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అంచనా వేయమని అధికారులకు చెప్పి మరుసటి రోజు కడప జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకొని వెళ్ళి నిధులు మంజూరు చేపించారు.