15 Views
Description: ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీల్లో ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థినుల బాత్రూముల్లో కెమెరాలు పెట్టిన ఘటనలపై ప్రభుత్వం మౌనం ఎందుకు? మరోవైపు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ హద్దు మీరుతోంది. వైయస్ఆర్ సీపీ నేత పోతిన మహేష్ గారు కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ, జనసేన ట్రోలింగ్ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటోందని, చిన్నపిల్లలకూ మానసికంగా హింస కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైకో ట్రోలర్లపై పోక్సో కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు దీనిపై స్పందిస్తారా?