రైతులకు ఋణామాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తరువాత మోసం చేసిన మీ టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వం లో పని చేస్తూ అహర్నిశలు రైతుల కోసం ప్రయత్నం చేస్తున్న మా పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ తో అన్నారు.
రాజుపాలెం మండలం లోనే రైతులకు 1,13,63,88,000 రూపాయలు డబ్బులు మా వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత లబ్ధి జరిగిందని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. గ్రామ గ్రామానా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరం వ్యవసాయ సేవలను చేస్తున్న వైసిపి ప్రభుత్వం ను విమర్శించే నైతికత మీకు లేదని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. నకీలీ విత్తనాలు, నకీలీ పురుగుల మందులు ఎప్పటి కప్పుడు పరీక్షించి నిర్దారించే పనిలో భాగంగా ఇంట్రీగేటెడ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసి రైతుల మేలు కోరుతున్న ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు.
30 రోజుల్లో పంట నష్టం డబ్బులు రైతుల ఖాతా లో జమ చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని విమర్శ చేయడం భావ్యం కాదు అని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. మీ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి ల కుటుంబ సభ్యులకు కూడా వైసిపి ప్రభుత్వం హాయం లో డబ్బులు వారీ ఖాతా ల్లో జమ చేసిన వైసిపి ప్రభుత్వాన్ని విమర్శ చేయడం మీ వయస్సు కు తగునా అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు .