జగన్ ప్రభుత్వం లో మాట ఇచ్చిన ప్రతి హామీ ని నెలబెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో ఇచ్చిన హామీ లను నిలబెట్టుకోలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఒక వార్డులో 1000 నుంచి 1100 ఇల్లు ఉంటే వాళ్ళకు కావాల్సిన ప్రతి ప్రభుత్వ పని నిర్వహించడానికీ ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అని దేశం మొత్తం మీద ఈ రకమైన పరిపాలన ఎక్కడా లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒక వార్డు పరిధి లో ఎ కుంటుంబానికీ ఎంత లబ్ధి జరిగిందో బోర్డు వేసి చెప్పగల్గిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అని ఇచ్చిన పథకం లో బోగస్ లేకుండా నిజాయుతి గా చెప్పగల్గినది గా ప్రకటన ఉందని ఇందులో లొసుగు లు ఉంటే టిడిపి పార్టీ కీ చెందిన ఏ ఒక నాయకుడు ఆయున నిరూపిస్తే రాచమల్లు వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయడాని ఎమ్మెల్యే ప్రకటన చేశారు .